అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చేనెల (ఏప్రిల్ 2025) మొదలు కావాల్సిన సినిమా మరింత ఆలస్యం కానుంది. అల్లు అర్జున్ ముందుగా అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ సగభాగం పూర్తయ్యాక త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడట.
అంటే 2026లోనే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుంది. త్రివిక్రమ్ తీసిన ‘గుంటూరు కారం’ జనవరి 2024లో విడుదలైంది. అల్లు అర్జున్ మూవీ జనవరి 2026లో మొదలైతే, త్రివిక్రమ్ రెండేళ్లు ఖాళీగా ఉన్నట్లు అవుతుంది. ఐతే, “పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్ కి పెరిగిన భారీ మార్కెట్, హిందీలో వచ్చిన క్రేజ్ ని చూసి త్రివిక్రమ్ ఇప్పుడు తన షూటింగ్ ని మరో 8 నెలలు పోస్టుపోన్ చేసేందుకు అంగీకరించాడు అని సమాచారం.
త్రివిక్రమ్ దర్శకుడిగా ఎన్నో హిట్స్ ఇచ్చారు. అల్లు అర్జున్ తో తీసిన మూడు చిత్రాలు – జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో – భారీ విజయం సాధించాయి. కానీ త్రివిక్రమ్ కి ఇప్పటివరకు జాతీయ స్థాయిలో హిట్టైన సినిమా లేదు. తన పాన్ ఇండియా కలలకు అల్లు అర్జున్ కి ఇప్పుడు ఉన్న మార్కెట్ కరెక్ట్ అని త్రివిక్రమ్ ఆలోచన. అందుకే నిరీక్షించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
వీరి కాంబినేషన్ లో రూపొందే కొత్త సినిమా కార్తికేయ కథ (స్కంద పురాణం) ఆధారంగా రూపొందనుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More