త్రిప్తి డిమ్రి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ సరసన నటిస్తోంది త్రిప్తి. “స్పిరిట్” సినిమాలో దీపిక చెయ్యాల్సిన పాత్ర ఆమెకి దక్కింది. భారీ పారితోషికంతో పాటు ఇతర డిమాండ్ల కారణంగా దీపికని తప్పించారు. దాంతో తన “యానిమల్” సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన త్రిప్తికి మెయిన్ హీరోయిన్ గా ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు సందీప్ రెడ్డి.
ఆమె పేరు ప్రకటించిన తర్వాత ఇన్ స్టాగ్రమ్ లో ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఆమెని ఫాలో అవడం మొదలుపెట్టారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.
ప్రస్తుతం త్రిప్తికి 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ స్టాగ్రామ్ లో. “స్పిరిట్” విడుదలయ్యేసరికి ఆమె ఎంత పెరుగుతారో చూడాలి. పెద్ద హీరోల సరసన నటిస్తే ఆటోమాటిక్ గా హీరోయిన్లకు పాపులారిటీ పెరుగుతుంది అనడానికి త్రిప్తి మరో ఉదాహరణ.
“యానిమల్” సినిమాకి ముందు ఆమె పారితోషికం 50 లక్షల లోపు. ఆ తర్వాత రెండు కోట్ల రూపాయలకు పెరిగింది ఆమె పారితోషికం. ఇప్పుడు 5 కోట్ల వరకు చేరింది అని టాక్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More