న్యూస్

‘మోనాలిసా’ పారితోషికం తెలుసా?

Published by

కుంభమేళాలో తీసిన ఫొటోలతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయింది మోనాలిసా. మధ్యప్రదేశ్ కు చెందిన పూసలు అమ్ముకునే ఈ అమ్మాయి కళ్లు చూసి పడిపోయాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. ఖర్గోన్ జిల్లాలో మహేశ్వర్ అనే ఊరిలో ఉన్న మోనాలిసా ఇంటికెళ్లి మరీ ఆమెతో అక్కడికక్కడే అగ్రిమెంట్ రాయించుకొని అడ్వాన్స్ ఇచ్చాడు.

తను తీయబోయే ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో మోనాలిసాను హీరోయిన్ గా తీసుకున్నాడు సనోజ్ మిశ్రా. ఆమెను ముంబయి తీసుకొచ్చి ఓ ఫ్లాట్ లో ఉంచాడు. రకరకాల మేకప్ లు వేసి, దుస్తులు తొడిగించి ఫొటోషూట్స్ కూడా చేస్తున్నాడు. ఈమధ్యే తనను ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు కూడా తీసుకెళ్లాడు.

ఇంతకీ ఈ సినిమా కోసం మోనాలిసాకు ఎంత ఎమౌంట్ ఇస్తున్నాడు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో నటించడానికి ఆమెకు 21 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు వెల్లడించాడు మిశ్రా. అమ్మాయి కొత్త కాబట్టి, ఆమెకు ట్రయినింగ్ ఇచ్చే బాధ్యతతో పాటు భోజనం-వసతి లాంటి సౌకర్యాల్ని కూడా తనే చూసుకుంటున్నట్టు వెల్లడించాడు.

అలా తొలి సినిమాకే 21 లక్షల రూపాయల పారితోషికం అందుకుంటోంది మోనాలిసా. అన్నట్టు ఇప్పుడీ ప్రాజెక్టుపై విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమా ఓపెనింగ్ కూడా అవ్వకముందే ఆగిపోయేలా ఉందని జితేంద్ర అనే నిర్మాత విమర్శలు చేస్తున్నాడు.

సనోజ్ ఓ తాగుబోతని, సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిల్ని ముంబయికి తీసుకొచ్చి వాడుకోవడం అతడికి అలవాటని ఆరోపిస్తున్నాడు జితేంద్ర. అతడిది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని, మోనాలిసా క్రేజ్ ను వాడుకొని పబ్బం గడుపుకుంటున్నాడని, సినిమా మాత్రం రాదని అంటున్నాడు.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025