న్యూస్

కాపీ కొడితే ఈజీగా దొరికిపోతారిప్పుడు!

Published by

ఒకప్పుడు తెలుగు సినిమా సంగీత దర్శకులు హిందీ, తమిళ్, మలయాళం సినిమాల పాటలను అలాగే ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ ని కాపీ కొట్టి తమ ట్యూన్స్ గా చెప్పుకునేవాళ్లు. మెల్లగా జనాలకు అర్థమైంది ఏది ఒరిజనలో, ఏది కాపీ ట్యూనో అనేది. మునుపటిలా ఇప్పుడు కాపీ కొట్టడం అంత సులువు కాదు.

మరీ ముఖ్యంగా బాగా వైరల్ అయిన పాటలను జనం సులువుగా గుర్తుపడతారు.

అది శ్రీలంక అయినా, కొరియా అయినా, ఆఫ్రికా అయినా ఇప్పుడు ఏ దేశానికి, ఏ భాషకు, ఏ ప్రాంతానికి చెందిన పాట అయినా బాగుంటే ఇట్టే వైరల్ అయిపోతుంది. అలా బాగా వైరల్ అయిన శ్రీలంక పాట “మణికే మాగే” “Manike Mage Hithe”. యోహని పాడిన ఈ పాటని చమత్ సంగీత్ కంపోజ్ చేశాడు. అలాంటి వైరల్ సాంగ్ ని అనిరుధ్ రవిచందర్ కాపీ కొట్టి దొరికిపోయాడు.

ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ … అనిరుధ్ రవిచందర్. సినిమాకి 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు.

ALSO READ: ‘దేవర’ పాట కాపీనా? నిర్మాత రిప్లై

అలాంటి సంగీత దర్శకుడు వేరే పాట నుంచి స్ఫూర్తి పొందినప్పుడు దాన్ని ముందే చెప్పాలి. అలా కాకుండా గప్ చుప్ గా కాపీ కొట్టి ఊరుకుంటే జనం ఊరుకుంటారా. అందుకే, ఇప్పుడు సోషల్ మీడియాలో “మణికే మాగే” నుంచి కాపీ కొట్టారని జనం ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ: ‘Chuttamalle’ copy controvery: Original music director responds

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025