నటి హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తిరిగి స్వాగతం పలికింది. ఆమెపై పెట్టిన సస్పెన్షన్ ను ఎత్తేసింది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆమెపై అసోసియేషన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ టైమ్ లో హేమ తను అక్కడ లేనని, రిసార్ట్ లో ఉన్నానంటూ వీడియో పెట్టారు. చికెన్ బిర్యానీ రెసిపీని కూడా పోస్ట్ చేశారు. అయినప్పటికీ బెంగళూరు పోలీసులు తమ పని తాము చేశారు.
హేమను తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లు జైళ్లో ఉన్నారు. అదే టైమ్ లో హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. హేమ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచించింది.
తాజాగా హేమ ఓ వీడియో పెట్టారు. టెస్టుల్లో తనకు నెగెటివ్ వచ్చిదంటూ అందులో చెప్పుకొచ్చారు. ఈ వీడియోను, రిపోర్టుల్ని పరిశీలించిన ‘మా’.. అంతర్గతంగా చర్చించి ఆమెపై నిషేధం ఎత్తేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఆమెకు లిఖితపూర్వకంగా చెప్పారు. తనపై సస్పెన్షన్ ఎత్తేసినందుకు ‘మా’కు థ్యాంక్స్ చెప్పారు హేమ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More