న్యూస్

50కి వచ్చాకే పెళ్లి?

Published by

సుష్మిత సేన్ వయసు ఇప్పుడు 48 ఏళ్ళు. మరో రెండేళ్లల్లో 50లో పడుతుంది. సాధారణంగా భారతీయ మహిళలు 50 ఏళ్ల వయసులో కొడుకో, కూతురో పెళ్లి గురించి ఆలోచన చేస్తారు. కానీ సుష్మిత సేన్ 50 వచ్చాక తన పెళ్లి గురించి ఆలోచన చేస్తుందట. ఆమె అంతే మరి.

ఆ మధ్య లలిత్ మోడీతో పెళ్లి అని హడావిడి జరిగింది. కానీ వారి డేటింగ్, వారి రిలేషన్ తొందర్లోనే బ్రేకప్ అయింది. పెళ్లిపీటల వరకు వెళ్ళలేదు.

తాజాగా తన పెళ్లి గురించి, తన బాయ్ ఫ్రెండ్స్ గురించి సుష్మిత సేన్ డిటైల్డ్ గా మాట్లాడింది.

మాజీ బాయ్ ఫ్రెండ్లతో స్నేహం

సుష్మిత సేన్ దాదాపు ఎనిమిది మందితో ప్రేమాయణం నడిపింది. వాళ్లందరితో తనకు ఇప్పటికీ మంచి స్నేహం ఉందని చెప్పింది. వాళ్ళతో రిలేషన్ షిప్ వర్కవుట్ కానంత మాత్రాన స్నేహంగా ఉండకూడదని రూల్ ఉందా అని ఆమె అడుగుతోంది. అంతే కాదు, తన మాజీ బాయ్ ఫ్రెండ్ భార్యలతో కూడా తనకు స్నేహం ఉందని చెప్పుకుంటోంది.

ఆ ఎనిమిది మంది వీరే

ఎక్కువ కాలం లవ్ ఎఫైర్ సాగించింది మాత్రం బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ తో. పెళ్లి వరకు వెళ్ళింది వీరి లవ్. కానీ ఎందుకో బ్రేకప్ చెప్పుకున్నారు. ​ముదుస్సార్ అజీజ్, సంజయ్ నేరంగా, ఇంతియాజ్ కత్రి వంటి వ్యాపారవేత్తలతో కొన్నాళ్ళూ డేటింగ్ సాగించింది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్ తో సంబంధం నడిపింది.

యువ హీరో రణదీప్ హుడాతో బంధం చాలా కాలం కొనసాగింది. ఇద్దరూ తరుచుగా అన్ని ఈవెంట్స్ కి హాజరయ్యేవారు. ఆమె పెళ్లి వైపు ఆసక్తి చూపకపోవడంతో రణదీప్ బ్రేకప్ చెప్పాడు. అతను ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు.

ఇక రోమన్ షాల్ అనే కుర్రాడితో ఒక నాలుగేళ్లు సహజీవనం చేసింది. ఆ తర్వాత వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్ చేసి పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకొని అతనికి టాటా బై బై చెప్పింది.

పెళ్ళికి సమయం లేదంట

పెళ్ళికి ఇది సమయం కాదని చెప్తోంది. 50 తర్వాత తీరిక దొరికితే చేసుకుంటాను అంటోంది. ఆమె చెప్పే మాటలకు అర్థం లేదు. ఆమె వివరణకు విలువ లేదు. మొత్తమ్మీద ఇప్పట్లో పెళ్లి లేదు. డేటింగ్ లు మాత్రం కంటిన్యూ.

Recent Posts

దర్శకులు హ్యాండ్ ఇస్తున్నారు!

అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More

July 6, 2025

అప్పుడు అలా… ఇప్పుడిలా!

సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More

July 6, 2025

యాక్టర్ అయి తిరిగి డాక్టర్ గా!

రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More

July 5, 2025

కీర్తికి పెళ్లయిందని చాలా బాధపడ్డా!

కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More

July 5, 2025

అనుదీప్ ను నెట్టేసిన పోలీసులు

అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More

July 5, 2025

ప్రభాస్ ఇప్పటికీ బాధపెడుతున్నాడు!

ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More

July 4, 2025