“పుష్ప 2” సినిమా మళ్ళీ వాయిదా కానుంది అని ఒకటే గోల. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది అనే ప్రచారం మొదలైంది. దానికి కూడా ఒక కారణం ఉంది. జులై నెలలో ఈ సినిమా షూటింగ్ మొత్తంగా ఆగిపోయింది. నెల రోజుల బ్రేక్ రావడంతో విడుదల విషయంలో డౌట్స్ మొదలయ్యాయి. ఐతే, అలాంటి డౌట్స్ అక్కర్లేదు అన్నట్లుగా ఈ రోజు సుకుమార్ ప్రకటన చేశారు.
బుధవారం రాత్రి నిర్వహించిన “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన అతిథిగా విచ్చేశారు. అల్లు అర్జున్ తో కలిసి సుకుమార్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు. రావు రమేష్, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సుకుమార్ భార్య తబిత ప్రెజెంట్ చేస్తున్నారు. సో, సుకుమార్ అతిధిగా విచ్చేసి సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా తనకు నచ్చింది అన్నారు.
ఇదే వేదికపై “పుష్ప 2” గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం తాను ‘పుష్ప 2’ క్లైమాక్స్ భాగం తీస్తున్నట్లు తెలిపారు. అంటే షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లే.
సుకుమార్ చెప్తున్న మాటని బట్టి “పుష్ప 2” డిసెంబర్ 6న యధావిధిగా విడుదల అవుతుంది. వాయిదా పడే అవకాశం లేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More