గాయని కల్పన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఐతే, తన తల్లి ఆత్మహత్య యత్నం చేసిందని మీడియా వార్తలు ప్రచురించడంపై కల్పన కూతురు మండిపడుతున్నారు.
కల్పన కూతురు దయ ఈ రోజు మీడియా ముందుకొచ్చారు. తన తల్లికి నిద్రలేమి సమస్య ఉందని, ఆ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని దయ చెప్తున్నారు.
ALSO READ: Singer Kalpana’s health bulletin: ‘Condition is stable’
కూతురితో గొడవలు, భర్తతో విబేధాల వల్లే కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది అని ప్రచారం నేపథ్యంలో దయ మాట్లాడింది. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని పేర్కొంది. తన తండ్రి ప్రసాద్ గురించి కూడా తప్పుడు ప్రచారం చేయొద్దని పేర్కొంది. “అమ్మానాన్న మధ్య కూడా ఎలాంటి గొడవలు లేవు. అమ్మ తిరిగి ఆరోగ్యం తిరిగి వస్తారు. దయచేసి మీడియా లేనివి ఉన్నవి వార్తలుగా సృష్టించొద్దు,” అని ఆమె కోరారు.
ఐతే, పోలీసుల విచారణ తర్వాత, కల్పన కోలుకున్నాకే అసలు విషయం బయటపడుతుంది. ఇన్ సోమ్నియా కోసం టాబ్లెట్స్ నిత్యం తీసుకునే కల్పన ఆ రోజు మోతాదుకి మించి ఎందుకు తీసుకున్నారు అనేది దయ చెప్పలేకపోయింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More