న్యూస్

నేను ఫిట్ గానే ఉన్నాను: షాలిని

Published by

“అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన షాలిని పాండే ప్రస్తుతం తెలుగులో అవకాశాలు పొందడం లేదు. ఆమె బాలీవుడ్ లో కెరీర్ బిల్డప్ చేసుకోవాలనుకొంది. కానీ బాలీవుడ్ లో ఆమె కెరీర్ కి ఎదుగూబొదుగూ లేదు.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది. ఐతే, ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫోటోల కింద ఎక్కువమంది నెగెటివ్ గా కామెంట్ చేస్తున్నారట. ముఖ్యంగా ఆమెని బాడీ షేమ్ చేస్తున్నారట. ఆమె వక్షసంపద అంతగా లేదు అని కొంచెం తిని కండ పెంచుకో అని సలహా ఇస్తున్నారు.

“పైన ఏమి లేవు కానీ తెగ చూపిస్తున్నావు” అంటూ షేమ్ చేస్తున్నారట. ఈ విషయాన్నీ మొన్నామధ్య ఇంటర్వ్యూలో పేర్కొంది. తెలుగులో తనకి అవకాశాలు పోవడానికి కూడా “వక్షసంపద” పెద్దగా లేదనే కారణంతోనే అని చెప్పింది. అందులో నిజమెంతో కానీ ఆమె ఈ రోజు (జులై 29) తన ఇన్ స్టాగ్రామ్ లోనే తన “ఫిట్ నెస్” గురించి కామెంట్ చేసేవారికి హెచ్చరిక అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

“కామెంట్ సెక్షన్‌లో నా శరీరం/బరువు గురించి సలహాలు ఇచ్చే వారికి చెప్పేది ఏంటంటే… మీ సలహాలు వద్దు థాంక్యూ… నేను మంచి ఫిట్ గానే ఉన్నాను” (To anyone giving me body/weight advice in the comment section…..No Thankyou, I’m at my fittesట్) అని రాసుకొంది.

షాలిని పాండే తక్కువ హైట్ ఉంటుంది. అలాగే సన్నగా ఉంటుంది. “అర్జున్ రెడ్డి” టైంలో కాస్త బొద్దుగానే ఉంది. బాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా సన్నబడింది. దాంతో ఆమెకి ఎక్కువ బాడీ షేమింగ్ అనుభవాలు ఎదురవుతున్నాయట.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025