సౌత్-నార్త్ నటీనటులు కలిసి సినిమాలు చేయడం కొత్తేం కాదు. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ లాంటి హీరోలు నటించారు. ఇక టాలీవుడ్ సినిమాల్లో దాదాపు బాలీవుడ్ నటీనటులంతా నటిస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండకు కావాల్సింది ఇది. ఓ ప్రాపర్ బాలీ-టాలీ కాంబినేషన్ కోరుకుంటున్నాడు ఈ హీరో. ఆ కాంబినేషన్ ఏంటనేది కూడా బయటపెట్టాడు. బాలీవుడ్ బాద్షా షారూక్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ బన్నీ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టాడు.
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి వేవ్స్-2025లో పాల్గొన్న దేవరకొండ.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంబినేషన్లు ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. షారూక్, బన్నీ ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించారని, ఈ ఇద్దరూ కలిస్తే ఇండియన్ సినిమా నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంటుందని అంటున్నాడు.
విజయ్ నటించిన ‘కింగ్డమ్’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం పాటల విడుదల కార్యక్రమం నడుస్తోంది. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More