సమంతకి ఎన్నో సమస్యలు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ. మయోసిటిస్ వంటి అనారోగ్యంతో పాటు ఇటీవల ఆమె చికును గున్యా బారిన కూడా పడిందట. ఐతే, ఇప్పుడు కోలుకున్నాను అని చెప్తోంది.
“చికును గున్యా నుంచి కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ కీళ్ల నొప్పులు, అవీ… అబ్బో …. “అని రాసుకొంది కొత్త వీడియోని షేర్ చేస్తూ. ఆమె జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. చికెన్ గున్యా నుంచి కోలుకున్న తర్వాత జిమ్ లో కసరత్తులు చేస్తుంటే కొంత నొప్పి, కొంత ఆనందం ఉంది అనే అర్థంలో రాసుకొంది.
ప్రస్తుతం ఆమె న్యూయార్క్ లో ఉంది. కొత్త ఏడాది సంబరాల కోసం న్యూయార్క్ వెళ్ళింది. 2025 మొదటి రోజు చర్చిలో క్యాండిల్ వెలిగించిన ఫోటోని కూడా షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ భామ సినిమాలు చెయ్యడం లేదు. ఎక్కువగా టూర్లు తిరుగుతోంది. అలాగే “రక్త బ్రహ్మాండ్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. గతేడాది ఆమె నటించిన “సిటాడెల్ హనీ బన్నీ” అనే వెబ్ సిరీస్ ఫెయిల్ అయింది. మరి ఈ కొత్త వెబ్ సిరీస్ అయినా ఆమెకి విజయం ఇస్తుందా అనేది చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More