ఊహించని విధంగా సూపర్ స్టార్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. వెంటనే అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేయగా, వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అలా ఆపరేషన్ నుంచి కోలుకున్న రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికెళ్లిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెబుతూ ఓ నోట్ విడుదల చేశారు.
“ఇటీవల ఆసుపత్రిలో చేరిన నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన నా రాజకీయ మిత్రులు, సినీ సన్నిహితులు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై అపరిమితమైన ప్రేమతో నా క్షేమం కోసం ప్రార్థించిన నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు.”
ఇలా తను క్షేమంగా ఉన్న విషయాన్ని రజనీకాంత్ వెల్లడించాడు. గత నెల 30న తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రజనీకాంత్ ను ఆస్పత్రిలో చేర్చారు. గుండెకు మంచి రక్తాన్ని సరఫరా చేసే నాళం (తెలుగులో బృహధమని అంటారు)లో స్టెంట్ వేశారు.
ఆయన నటించిన “వేట్టయన్” విడుదలకు సిద్ధమైంది. ఇది కాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. రజనీకాంత్ వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More