మహేష్ బాబు – రాజమౌళి చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. 2024లోనే మొదలవుతుంది అని భావించారు. కానీ రాజమౌళి ఎప్పటిలానే స్లోగా ప్రీ-ప్రొడక్షన్ పనులు చేశారు. దాంతో మహేష్ బాబు ఏడాది కాలంగా గడ్డం, జుట్టు పెంచుకొని కూర్చోవాల్సి వచ్చింది.
తాజాగా రాజమౌళి విశాఖ సమీపంలోని బొర్రా గుహలను సందర్శించారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు తీసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. రాజమౌళి ఇటీవల కెన్యా కూడా వెళ్లారు. అక్కడ కొన్ని లొకేషన్లను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాని అడ్వెంచర్ థ్రిల్లర్ గా తీయనున్నారు. అందుకే ఇలాంటి లొకేషన్లు వెతుకుతున్నారు.
ఆఫ్రికాకి చెందిన విల్బర్ స్మిత్ రాసిన నవలల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాని తీస్తున్నారు. మహేష్ బాబు ఇందులో ఇండియానా జోన్స్ తరహా పాత్రలో కనిపిస్తారు.
రాజమౌళి ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రాని తీసుకోవాలని భావిస్తున్నారు అని బాలీవుడ్ మీడియా కథనాలు. కీరవాణి సంగీతం అందించే ఈ సినిమాలో హాలీవుడ్ తారలు కూడా నటిస్తారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More