పీపుల్ స్టార్, అందరివాడు ఆర్.నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. డాక్టర్ బీరప్ప నేతృత్వంలో నారాయణమూర్తికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు సాధారణ టెస్టులే చేశామని, ఎలాంటి సమస్య లేదని, కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.
తన అస్వస్థతపై నారాయణ మూర్తి కూడా స్పందించారు. తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన ప్రకటించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిమ్స్ లో తనకు మంచి ట్రీట్ మెంట్ దొరికిందని తెలిపారు.
ఈరోజు ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు నారాయణ మూర్తి. కానీ ఏమీ మాట్లాడలేకపోయారు, తనకు నీరసంగా ఉందని, ఏమీ మాట్లాడలేకపోతున్నానని మాత్రమే అన్నారు. లోపల ఏదో అవుతోందని, బాగా అలసటగా ఉందని అన్నారు. వెంటనే ఆయన్ను నిమ్స్ లో చేర్పించారు.
అన్నీ తానై సినిమాలు తీసే నారాయణ మూర్తి, తాజాగా యూనివర్సిటీ అనే మూవీని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉక్కు సంకల్పం అనే సినిమా తీస్తున్నారు. ఆయన వయసు 70 ఏళ్లు. కొన్ని నెలల కిందట ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More