న్యూస్

2 మిలియన్ క్లబ్ లో పుష్ప-2

Published by

‘పుష్ప-2’ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉంది. కానీ అంతలోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. అవును.. యూఎస్ఏలో బన్నీ సినిమా ప్రభంజనం మొదలైంది. ప్రీ-సేల్స్ లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది.

మరో 2 రోజుల్లో ఈ సినిమా అమెరికాలో రిలీజ్ అవుతోంది. విడుదల్లోపు ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

నిజానికి ఈ సినిమా ఈ పాటికే 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరాలి. కానీ అమెరికాలో క్రిస్మస్ బరిలో పోటీ తీవ్రంగా ఉంది. డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు చాలా హాలీవుడ్ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి. దీంతో ‘పుష్ప-2’కు స్క్రీన్ కౌంట్ తగ్గిందంటున్నారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ విడుదలకు రంగం సిద్ధమైంది. విడుదలకు ముందు వేసే బెనిఫిట్ షో నుంచి, ఏకథాటిగా 19 రోజుల పాటు ఈ సినిమాకు నైజాంలో టికెట్ రేట్లు పెంచారు. మల్టీప్లెక్సుల్లో మొదటి వారాంతం (4 రోజులు) టికెట్ పై 200 రూపాయలు.. ఆ తర్వాత 8 రోజులు 150 రూపాయలు, అక్కడ్నుంచి మరో వారం రోజులు టికెట్ పై 50 రూపాయలు పెంచారు.

అలా 19 రోజుల పాటు ‘పుష్ప-2’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఇక బెనిఫిట్ షోలకైతే ఏకంగా టికెట్ పై 800 రూపాయల పెంపుకు అనుమతినిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 12500 స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Recent Posts

రూ.6 కోట్లు చేజారిపోతాయా?

తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More

May 23, 2025

కనకమేడల అసందర్భ ప్రకటన

చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More

May 23, 2025

పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More

May 23, 2025

బన్నీకి ఈ భామలు ఫిక్స్!

అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More

May 23, 2025

వీళ్లకు అంత సీనుందా?

కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More

May 23, 2025

సిమ్రాన్ కి ‘డబ్బా తార’ క్షమాపణ

సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More

May 22, 2025