ప్రభాస్ టైటిల్ తో సినిమా చేశాడు ప్రియదర్శి. అదే ‘డార్లింగ్’ సినిమా. ఇది కేవలం సినిమా టైటిల్ మాత్రమే కాదు, ప్రభాస్ ట్యాగ్ లైన్ కూడా. అందర్నీ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తాడు ప్రభాస్, అందరితో డార్లింగ్ అనిపించుకుంటాడు. అలాంటి టైటిల్ ను తన సినిమా కోసం వాడేశాడు ప్రియదర్శి.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన ప్రియదర్శి… ‘డార్లింగ్’ అనే టైటిల్ పెట్టినప్పుడు ప్రభాస్ నుంచి, ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి చాలా మద్దతు దక్కిందంటున్నాడు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
“కెరీర్ లో చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగాను. కానీ మనసులో మాత్రం ప్రభాస్ తో నటించాలనే కోరిక అలానే ఉండిపోయింది. ఓ సందర్భంలో ప్రభాస్ ను కలిశాను. ధైర్యం చేసి అడిగేశాను. అన్న.. మీ సినిమాలో నటించాలని ఉంది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాను. అప్పుడు ప్రభాస్ నవ్వేశాడు.”
ఆ ఘటన జరిగిన 10 రోజులకే ప్రభాస్ టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని, ‘రాధేశ్యామ్’ సినిమాలో నటించే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More