“హను మాన్” సినిమా హిట్ కాగానే అనేక సినిమా ప్రాజెక్ట్ లు ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా, మరికొన్నింటికి కథకుడిగా, కొన్నింటికి ప్రెజెంటర్ గా …. ఇలా ప్రశాంత్ వర్మ ఫుల్లుగా సంపాదించే టార్గెట్ తో హడావిడి చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన కథ అందించిన సినిమా నిన్న విడుదల అయింది. అదే … దేవకి వాసుదేవ నందన.
మహేష్ బాబు అల్లుడు అశోక్ గల్లా నటించిన ఈ సినిమాని చూసిన తర్వాత అందరి మాట ఒకటే…ఏముంది ఈ కథలో. కృష్ణుడి, కంసుడి కథకి పులిహోర కలిపి వండిన ఈ వంటకం చూసి అందరూ వర్మని విమర్శిస్తున్నారు. దేవుడి పేరు చెప్పి పాచిపోయిన కథలను అందిస్తున్నారు అనేది మెయిన్ కామెంట్.
ఇక ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ … జీరో. మొత్తమ్మీద “హను మాన్” తర్వాత ప్రశాంత్ వర్మ అందించిన కథల్లో మొదటిది ఢమాల్. ఇంకా ఈయన యూనివర్స్ లో ఉన్న కథల ఫలితాలు త్వరలోనే చూస్తాం.
దర్శకుడిగా ప్రశాంత్ వర్మ ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా ప్రకటించారు. అలాగే “హనుమాన్”కి సీక్వెల్ గా “జై హనుమాన్” కూడా తీస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More