ప్రభాస్ పెళ్లి గురించి అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఇప్పుడు దాని గురించి చర్చించడం మానేశారు. ప్రభాస్ – అనుష్క పెళ్లి అని కొన్నాళ్ళూ, ప్రభాస్ – కృతి సనన్ పెళ్లి అని మరి కొద్దీ రోజులు, అలాగే ఒక గోదావరి జిల్లా అమ్మాయితో పెళ్లి చూపులు అని … ఇలా ఎన్నో వార్తలు అల్లేశారు. కానీ ఒక్కటీ ఇప్పటివరకు నిజం కాలేదు.
ఇక త్వరలో ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” విడుదల కానుంది. వచ్చే నెలాఖరులో రానున్న ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రమోషన్లు మొదలు కానున్నాయి. ఇలాంటి టైంలో ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టడం కలకలం రేపింది.
“డార్లింగ్స్… ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించనున్నారు… వెయిట్ చేయండి…” అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఇది అందరిలో ఆసక్తి క్రియేట్ చేసింది. పెళ్లి గురించి ప్రకటన చేస్తాడేమో అని మీడియా అంచనా వేస్తోంది. కాదు… ఇది సినిమా ప్రమోషన్ కి సంబంధించిన విషయం అని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి సస్పెన్స్ తో కూడిన ఈ పోస్ట్ షేర్ చేసి ప్రభాస్ కలకలం రేపాడు అన్నది నిజం.
ఐతే చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఇది ఖచ్చితంగా పెళ్లి గురించి మ్యాటర్ కాదు. ఇది “కల్కి 2898 AD” చిత్రం లేదా మరో మూవీకి సంబంధించి ప్రొమోషన్ అయి ఉంటుంది. లేదా అంటే ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కావొచ్చు.
44 ఏళ్ల ప్రభాస్ కి పెళ్లి మీద ఆసక్తి లేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More