ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అపూరూపమైన గెలుపు అందుకున్నారు. ఆయన పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లో (21 అసెంబ్లీ సీట్లు) విజయం చూసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంలో పవన్ కల్యాణ్ ది ప్రధాన పాత్ర. అందుకే ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.
సాధారణంగా ఉపముఖ్యమంత్రి పదవి అంటే ఆరో వేలు అని, పేరు గొప్ప పదవి మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. ఐతే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. కీలకమైన శాఖలు అప్పగించారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఆయనది నెంబర్ 2 అనే సింబాలిక్ గుర్తింపు కూడా ఇచ్చారు.
సో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి ఆయన అభిమానులను బాగా ఆనందపరిచింది. ఇక “పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి,” అని ఆ పార్టీ కూడా ప్రకటించింది.
ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా ఈ నెల 19న బాధ్యతలు స్వీకరిస్తారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More