నితిన్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. రెండింటికీ విడుదల తేదీలు ప్రకటించారు. అటుఇటుగా 2 నెలల గ్యాప్ లో ఈ 2 సినిమాలు థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి.
‘రాబిన్ హుడ్’ సినిమాను లెక్కప్రకారం క్రిస్మస్ కు విడుదల చేయాలి. కానీ ఆ సినిమా క్రిస్మస్ కు రావడం లేదు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. అందుకే ఓ సాంగ్ ను కూడా ‘సాంకేతిక కారణాలు’ అనే సాకు చూపుతూ వాయిదా వేశారు.
ఇప్పుడీ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనే విషయంలో ‘మైత్రీ’ కుస్తీ పడుతోంది. ఎందుకంటే అటు నితిన్ చేస్తున్న మరో సినిమా ‘తమ్ముడు’ శివరాత్రికి విడుదల కావాలి
‘రాబిన్ హుడ్’ కనుక ఫిబ్రవరిలో వస్తే ‘తమ్ముడు’ రిలీజ్ కూడా వాయిదా అవుతుంది. తాజా సమాచారం ప్రకారం “రాబిన్ హుడ్” చిత్రాన్ని వాలెంటైన్స్ డేకి కానీ శివరాత్రికి కానీ రిలీజ్ చేస్తారట. దాంతో దిల్ రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ సినిమాని వేసవి సెలవుల్లో చివర్లో రిలీజ్ చేస్తారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More