న్యూస్

ఇద్దరూ ‘కలర్ ఫుల్’ రాణులే!

Published by

ప్రభాస్ గత కొంతకాలంగా పూర్తిగా యాక్షన్ చిత్రాలే చేస్తున్నారు. అంతా మాస్. ఫైట్లతో, యాక్షన్ ఎపిసోడ్లతో కూడైన చిత్రాలే. ఈ మధ్య సూపర్ హిట్టయిన “సలార్” చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ తో ఎలాంటి రొమాంటిక్ ఎపిసోడ్ లు కానీ, డ్యూయెట్లు పాడడం కానీ చెయ్యలేదు. అలా పూర్తిగా “కలర్ ఫుల్” ఎంటర్ టైన్మెంట్ కి ప్రభాస్ దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఐతే ఆ లోటు మారుతి తీస్తున్న “ది రాజా సాబ్” సినిమాతో తీరుతుందట.

“ది రాజా సాబ్” సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ప్రధానంగా ఇద్దరు హీరోయిన్లే ప్రభాస్ కి లవ్ జోడి. ఇద్దరూ గ్లామర్ భామలే. తెరనిండా అందాలే అందాలు.

నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్. ఆమెకి ఇది చాలా పెద్ద సినిమా. పవన్ కళ్యాణ్ సరసన “హరి హర వీర మల్లు” సినిమా చేస్తోంది కానీ అది ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేం. పైగా అందులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తుంది. “ది రాజా సాబ్”లో గ్లామర్ పాత్ర. ప్రభాస్ తో సరసం, రొమాన్స్ కలర్ ఫుల్ గా ఉంటుందట.

నిధి అగర్వాల్ అందాల ఆరబోతలో దిట్ట. ఆమె ఈ సినిమాలో ఇంకా రెచ్చిపోవడం ఖాయం.

మాళవిక మోహనన్

మాళవిక మోహనన్ తెలుగులో ఇంతవరకు నటించలేదు కానీ ఆమెకి మంచి క్రేజ్ ఉంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ నిండా స్కిన్ షోతో కూడిన ఫొటోలే పోస్ట్ చేస్తుంటుంది. అందుకే కుర్రకారుకు ఇష్టం. ఇక ఈవెంట్లకు కూడా పై ఫొటోలోలాగా వస్తుంది. దాన్ని బట్టి ఆమె ఏ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోత తెరనిండా ఉంటుంది. మొత్తం కలర్ ఫుల్లు.

Recent Posts

బాలయ్య, చిరంజీవి, వెంకటేష్!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More

July 8, 2025

అందుకే అనుపమకి కష్టాలు!

అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More

July 8, 2025

2025: మలి సగం మెరవాల్సిందే!

6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More

July 7, 2025

సూర్య సినిమాకు రెహ్మాన్

లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు… Read More

July 7, 2025

దర్శకులు హ్యాండ్ ఇస్తున్నారు!

అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More

July 6, 2025

అప్పుడు అలా… ఇప్పుడిలా!

సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More

July 6, 2025