దీపావళి వస్తే చాలామందికి చిన్నచిన్న గాయాలు అవ్వడం సహజం. కొంతమందికి చాలా పెద్ద గాయాలు కూడా అవుతుంటాయి. హీరోయిన్ నబా నటేష్ అయితే దీపావళి సందర్భంగా చేతులు కాల్చుంది. అయితే ఇప్పుడు కాదు, చిన్నప్పుడు.
ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టింది. ప్రతి దీపావళిని అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది నభా నటేష్. ఓసారి ఇలానే దీపావళి మరుసటి రోజు రోడ్డుపై సగం కాలి పడిపోయిన లక్ష్మీ బాంబుల్ని సేకరించిందట. వాటి నుంచి పొడి వేరు చేసి, తను ప్రత్యేకంగా కొన్ని టపాసులు తయారు చేసిందంట.
అలా చేసిన టపాసులు తన చేతిలోనే పేలాయని, దాంతో వేళ్లకు గాయాలయ్యాయని చెప్పుకొచ్చింది నభా నటేష్. అప్పట్నుంచి దీపావళి రోజున ప్రయోగాలు చేయడం మానేశానని, చాలా జాగ్రత్తగా పండగను సెలబ్రేట్ చేసుకుంటానని అంటోంది.
కొన్ని కారణాల వల్ల రెండేళ్లుగా అమ్మమ్మ ఇంటికి వెళ్లడం నభాకు కుదర్లేదంట. అందుకే ఈసారి మాత్రం అన్ని పనలు పక్కనపెట్టి మరీ అమ్మమ్మ ఇంట్లో వాలిపోయిందట. 2 రోజులు అక్కడే ఉండి, ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ వస్తానంటోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More