నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ తో విశ్వక్ సేన్ నటించిన “లైలా” చిత్రం ఇరుకునపడింది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ గురించి కొన్ని సెటైర్లు ఉన్నట్లు పృథ్వీ చెప్పారు. దాంతో, ఈ సినిమాపై వైఎస్సార్సపీ సోషల్ మీడియా జనం ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఇప్పుడు ఈ సినిమా టీం నష్టనివారణ చర్యలు చేపట్టింది.
విశ్వక్ సేన్ … నందమూరి బాలకృష్ణకి క్లోజ్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ తనదే అన్నట్లుగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్. జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెడితే, ప్రస్తుతం మెగా కుటుంబం – బాలయ్య ఒకే గూటికి (ఎన్డీయే) చెందినవారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమాలో వైఎస్సార్సీ పార్టీపై సెటైర్లు ఉండడం వింతేమీ కాదు.
ఐతే తమ సినిమాకి రాజకీయ రంగు పడొద్దని “లైలా” టీమ్ కోరుకుంటోంది. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఓకే కానీ రిలీజ్ కి ముందే ఇలాంటి గొడవలు ఎందుకంటీ టీమ్ భావిస్తోందట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More