సత్యదేవ్, అతిరా రాజ్, అర్చన నటించిన “కృష్ణమ్మ” మే 10న విడుదల కానుంది. ఈ సినిమా మంచి తృప్తినిచ్చింది అంటోంది టీం.
హీరో సత్యదేవ్
సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో వస్తారని నమ్మకం ఉంది. దర్శకుడికి తొలి సినిమా అంటున్నారు. కానీ మేకింగ్ మాత్రం పది సినిమాలు చేసిన డైరెక్టర్ లా చేశారు. ఇలాంటి కథను నాకు ఇచ్చినందుకు తనకు నేను రుణపడి ఉంటాను. తనకు ఈ సినిమాకు తొలి మెట్టు మాత్రమే. తను భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేస్తారు. మా నిర్మాత కృష్ణగారు ప్యాషన్‌తో కృష్ణమ్మ సినిమా చేశారు. ఆయనకు థాంక్స్. కొరటాల శివగారు లేకపోతే ఈ సినిమాకు ఇంత బజ్ వచ్చేది కాదు. ఆయనకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ గొప్ప సంగీతాన్ని ఇచ్చారు.
హీరోయిన్ అర్చన
విజువల్ ఎమోషనల్ మూవీగా నచ్చుతుంది. పద్మ అనే పాత్రకు నేను సూట్ అవుతాననిపించి అవకాశం ఇచ్చిన మా నిర్మాత కృష్ణగారికి, దర్శకుడు గోపాలకృష్ణగారికి థాంక్స్. సత్యదేవ్‌గారు చాలా మంచి కో ఆర్టిస్ట్.
హీరోయిన్ అతిరా రాజ్
నాతో పాటు నటించిన సత్యదేవ్ గారికి, అర్చనకు అందరికీ థాంక్స్. ఈ సినిమా మీకు నచ్చుతుంది.
దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ
కొరటాలగారు నాలుగు గంటల పాటు కథ విని ఓకే చేశారు. ఆయనకు విజయవాడ గురించి బాగా తెలుసు. ఆయనే ఆశ్చర్యపొయేలా కొత్త విజయవాడను ఈ సినిమాలో చూపించాం. ఇందులో బెజవాడ పాలిటిక్స్, రౌడీలు కనిపించరు. బెజవాడ కుర్రాళ్లలోని రుబాబుతనం, అమాయకత్వం బేస్ చేసుకుని కథను రాశాం. కృష్ణా నది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టిందనేది ఎవరికీ తెలియదు. అలాగే ఈ సినిమాలో హీరో, అతని ఫ్రెండ్స్ ఎలా పుట్టారనేది తెలియదు. అనాథలు. అలాగే కృష్ణమ్మ ప్రహించేటప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. హీరో అతని ఫ్రెండ్స్ జీవితాలు అన్ని మలుపులు తిరుగుతాయి. అందుకనే ఈ సినిమాకు కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టాం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More