న్యూస్

హరీష్  ని వెంటాడుతోన్న ‘బచ్చన్’

Published by

కొన్ని సినిమాలు కొందర్ని అలా గుచ్చుతూనే ఉంటాయి. ఆ గాయాలు మినిమం గ్యాప్స్ లో రగులుతూనే ఉంటాయి. ఎవరేం చేయలేరు, ఆ సినిమాలు చేసిన డ్యామేజీలు అలాంటివి. ఉదాహరణకు ‘ఆదిపురుష్’ సినిమానే తీసుకుంటే, అదొచ్చి ఇన్నేళ్లయినా దర్శకుడు ఓం రౌత్ ను అది వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు హరీశ్ శంకర్ విషయంలో కూడా అలాంటి ఓ సినిమా పుట్టుకొచ్చింది. అదే ‘మిస్టర్ బచ్చన్’.

రవితేజ హీరోగా హరీశ్ తీసిన తాజా చిత్రం ఇది. ఇది రీమేక్ అయినప్పటికీ తనదైన శైలిలో మార్పుచేర్పులు చేసి ప్రేక్షకులకు అందించా​డు. అయితే సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు సరికదా, ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది.

తన కెరీర్ లో రవితేజ ఎన్నో డిజాస్టర్లు చూశాడు కానీ, ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ మాత్రం ఎపిక్ అంటారు మాస్ రాజా ఫ్యాన్స్. ఈ సినిమా విషయంలో హరీశ్ పై జరిగిన ట్రోలింగ్ అంతాఇంతా కాదు. ఎప్పటికప్పుడు ఆయన వాటిని తిప్పికొడుతూనే ఉన్నాడు, అలసిపోయి లేదా విసిగిపోయి ఇక స్పందించడం మానేశాడు.

అలా అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో పాతగాయాన్ని మళ్లీ రేపాడు రానా. ఓ అవార్డ్ ఫంక్షన్ లో యాంకరింగ్ చేస్తూ.. ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ‘హై’ చూశారు, అలాగే ‘లో’ కూడా చూశారంటూ కామెంట్ చేశాడు.

రానా దృష్టిలో ‘హై’ అంటే కల్కి, ‘లో’ అంటే మిస్టర్ బచ్చన్ అని అర్థం. దీనిపై కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ నేరుగా హరీశ్ నే ట్యాగ్ చేశారు.

“ఎన్నో విన్నాను.. అందులో ఇదోటి, అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా, ఎవరికైనా.. ” అంటూ స్పందించాడు హరీశ్. అతడి బాధ, ఆవేదన ఆ పోస్టులో స్పష్టంగా కనిపించింది. 

Recent Posts

స్టంట్ మాస్టర్ పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More

May 22, 2025

షుగర్ బేబీ త్రిష అందాలు

అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More

May 21, 2025

చరణ్ నెక్ట్స్ సుక్కుదేనంట!

త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More

May 21, 2025

రఘుబాబు పాట ప్రయాస!

నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More

May 21, 2025

కియరాపై వర్మ ‘చిల్లర’ పోస్ట్

"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More

May 21, 2025

ఆర్తికి నెలకు 40 లక్షలు కావాలంట

తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More

May 21, 2025