తెలుగు హీరోయిన్లు ప్రారంభంలో ఆకట్టుకున్నప్పటికీ రోజులు గడిచేకొద్దీ, కెరీర్ దొర్లేకొద్దీ అవకాశాలు తగ్గిపోతుంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ఈషా రెబ్బా. కెరీర్ మొదలైన కొత్తలో ఈమెకు అవకాశాలు బాగానే వచ్చాయి.
ఏకంగా ఎన్టీఆర్ సరసన కూడా నటించింది. తెలుగమ్మాయిలకు అవకాశాలు రాదనేది కేవలం భ్రమ మాత్రమేనని, టాలెంట్ ఉంటే అందరికీ అవకాశాలొస్తాయంటూ గతంలో మంచి స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చింది.
కట్ చేస్తే, ఈషా కెరీర్ మూణ్నాళ్ల ముచ్చటైంది. ఆమెకు అవకాశాలు క్రమంగా సన్నగిల్లాయి. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పుకోవాలి. చివరికి ఇంద్రగంటి కూడా తన సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.
దీంతో ఈషా ఇప్పుడు ఫొటోషూట్స్ నే నమ్ముకుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోల్ని పోస్టు చేస్తూ లైవ్ లోనే ఉన్నాననే సందేశాన్ని మీడియాకు ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓటీటీపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. సిల్వర్ స్క్రీన్ ఆశలు దాదాపు ఆవిరైపోయినట్టే.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More