న్యూస్

చందు మొండేటి డ్రీమ్!

Published by

తన ఫేవరెట్ హీరోతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. దర్శకుడిగా ఎదిగే క్రమంలో ఆ డ్రీమ్స్ ను నెరవేర్చుకుంటుంటారు. ఈ విషయంలో అనీల్ రావిపూడి, బాబి, హరీశ్ శంకర్ లాంటి దర్శకులు ముందున్నారు. ఎందుకో చందు మొండేటి మాత్రం వెనకబడిపోయాడు.

అనీల్ రావిపూడికి ఇష్టమైన హీరో వెంకటేశ్. వెంకీతో సినిమా చేయాలనేది అతడి డ్రీమ్. ఆ కలను అతడు ఒకటికి మూడు సార్లు నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలో వెంకీకి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కూడా ఇచ్చాడు. ఇక బాబి, హరీశ్ శంకర్ కూడా తమ కలల్ని సాకారం చేసుకున్నారు. ఫేవరెట్ హీరోలతో సినిమాలు చేశారు.

మరి చందు మొండేటి సంగతేంటి? తన ఫేవరెట్ హీరో అంటే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నాగార్జున అంటుంటాడు ఈ దర్శకుడు. కానీ ఇప్పటివరకు నాగ్ తో సినిమా చేయలేకపోయాడు. భవిష్యత్తులోనైనా చేస్తాడా? కచ్చితంగా చేస్తానంటున్నాడు.

“గతంలో నాగార్జునతో సినిమా చేయాలనుకున్నాను. కథ కూడా చాన్నాళ్ల కిందటే రెడీ చేసుకున్నాను. అదొక పోలీస్ కథ. అప్పట్లో అది అడ్వాన్స్ డ్ స్టోరీ-స్క్రీన్ ప్లే ఉన్న కథ. హీరో క్యారెక్టర్ పాజిటివా, నెగెటివా అనే సందేహం కలిగించేలాంటి స్క్రీన్ ప్లే అది. ఎప్పుడైతే ‘విక్రమ్’ సినిమా వచ్చిందో, ఆ కథను ఇక సినిమాగా తీయలేనని అర్థమైపోయింది. ప్రస్తుతానికైతే నాగార్జుతో సినిమా చేయాలని బలంగా ఉంది.”

ఏడాదిన్నర నుంచి నాగార్జున సినిమా కథ కోసం ఆలోచనలో ఉన్నానని.. తన మైండ్ లో చిన్న స్పార్క్ వచ్చినా లేదా ఎవరైనా ఓ మంచి స్టోరీలైన్ ఇచ్చినా నాగ్ తో సినిమా చేయడానికి రెడీ అని ప్రకటించాడు ఈ దర్శకుడు. నాగార్జునతో ఎప్పుడు సినిమా చేసినా ‘కూలీ’, ‘విక్రమ్’ రేంజ్ లో స్టయిలిష్ యాక్షన్ మూవీ చేయాలనేది తన ఆలోచనగా చెప్పుకొచ్చాడు.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025