ఆల్కహాలు పుచ్చుకోని హీరోలు లేరు. కానీ ఎవరూ తమ ‘బ్రాండ్’ మందు గురించి గొప్పగా చెప్పుకోరు. అది కూడా పబ్లిక్ గా. కానీ నందమూరి బాలకృష్ణ తాను తీసుకునే “మ్యాన్షన్ హౌజ్” అనే బ్రాండ్ గురించి తన ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. తన సినిమాల్లోనూ చూపించారు.
ఇప్పుడు ఏకంగా అదే బ్రాండ్ ని ప్రచారం చేస్తున్నారు. “మ్యాన్షన్ హౌజ్”కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన బాలయ్య ఆ యాడ్ లో నటించారు. “బాటిల్డ్ వాటర్” (మంచి నీళ్లు) అంటూ ఆ బ్రాండ్ బాలయ్యతో యాడ్ చేసింది. పేరుకు నీళ్ల బాటిల్ కానీ దాని యాడ్ ఉద్దేశం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతోంది. నందమూరి గొప్ప పేరున్న ఫ్యామిలీకి ఈ తరంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వచ్చిన బాలయ్య ఇలా మందు బ్రాండ్ కి యాడ్స్ చెయ్యడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం అందులో తప్పేముంది అంటున్నారు. ఆయన భోళాగా ఉంటారు. ఇప్పుడు బాలయ్యకి ఉన్న క్రేజ్ తో బ్రాండ్స్ వస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు కూడా పాన్ పరాగ్ యాడ్స్ చేస్తున్నారు కదా అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి బాలయ్య బిగ్ బాస్ హౌజ్ లోకి హోస్ట్ గా అడుగుపెడుతారని ప్రచారం జరుగుతున్న టైములో ‘మ్యాన్షన్ హౌజ్’తో వచ్చారు.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More