సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ తన భార్యతో విడాకుల గురించి స్పందించారు. ఆయన భార్య సైరా మొదట విడిపోతున్నట్లు ప్రకటించారు. రాత్రి పొద్దుపోయాక రెహమాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
29 ఏళ్ల వారి కాపురానికి ముగింపు పడింది. 30వ యానివర్సరీ జరుపుకుంటామని భావించాను కానీ ఇలా జరిగిందని రెహమాన్ వాపోయారు.
“30కి చేరుకోవాలని భావించాం. కానీ అన్నింటికీ ముగింపు ఉంటుంది అని అర్థం అవుతోంది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. పగిలిన ముక్కలు అతుక్కోవు. అయినా ఈ వేర్పాటులో కూడా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ క్లిష్ట సమయాన్ని దాటే క్రమంలో మాకు అండగా ఉన్న మిత్రులకు ధన్యవాదాలు.”
అది రెహమాన్ స్పందన.
మణిరత్నం తీసిన “రోజా” సినిమాతో ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి చిత్రంతోనే సంచలనం సృష్టించారు. “రోజా” విడుదలైన మూడేళ్లకు సైరాని పెళ్లాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరూ వయసుకు వచ్చినవాళ్ళే. ఇటీవలే అంబానీల పెళ్లి వేడుకలో రెహమాన్, సైరా అన్యోన్యంగా కనిపించారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More