చిన్ననాటి ఫొటోల్ని షేర్ చేసి, ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా అంటూ జరిగే క్విజ్ పోటీలు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. సడెన్ గా సోషల్ మీడియాలోకి ఈ చిన్నారి ఫొటో వచ్చి పడింది.
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న చిన్నారి పేరు నభా నటేష్. అవును.. ఇప్పుడు హీరోయిన్ గా కొనసాగుతున్న నభా నటేష్ చిన్నప్పటి ఫొటోలే ఇది. వీటిని స్వయంగా ఆమె షేర్ చేసింది. ఉన్నఫలంగా వాటిని షేర్ చేయడం పెద్ద రీజనేం లేదు.
చిల్డ్రన్స్ డే కాబట్టి, తన చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసుకుంది నభా. “చిన్నప్పుడు టాఫీలు (చాక్లెట్లు) కంటే ట్రోఫీలే ఎక్కువగా లవ్ చేశాను.” అంటూ ఓ క్యాప్షన్ కూడా తగిలించింది.
చిన్నప్పుడు తన బ్రైట్ స్టూడెంట్ అనే విషయాన్ని ఆమె ఇలా పరోక్షంగా వెల్లడించింది. షేర్ చేసిన స్టిల్స్ లో ఒక ఫొటోలో ఆమె మెడల్ అందుకుంటోంది, మరో ఫొటోలో ట్రోఫీ అందుకుంటోంది. ట్రోఫీ అందుకుంటున్న ఫొటోలో మాత్రం నభా నటేష్ ను ఈజీగా గుర్తుపట్టొచ్చు.
ఆమె చిన్నప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు కూడా దాదాపు అలానే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘స్వయంభూ’ అనే సినిమాతో బిజీగా ఉంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More