“యానిమల్” సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది తృప్తి డిమ్రి. ఆమె అంతకుముందు ఏ సినిమాలు చేసిందో కూడా జనాలకు తెలీదు కానీ “యానిమల్”తో టాప్ లిస్ట్ లోకి దూసుకొచ్చింది. తాజాగా ఆమె నటించిన “బ్యాడ్ న్యూజ్” సో సో అనిపించుకొంది.
విక్కీ కౌశల్, తృప్తి నటించిన ఈ సినిమా మొదటి వారం ఇండియాలో 43 కోట్ల వసూళ్లు అందుకొంది. ఇది పెద్ద మొత్తం కాదు కానీ ఇలాంటి సినిమాకి ఈ మాత్రం ఓపెనింగ్ రావడం కూడా గ్రేట్. ఓవరాల్ గా ఈ సినిమా ఫ్లాప్ కాలేదు. బాలీవుడ్ చిత్రాలకు ఇప్పుడు అదే పెద్ద విజయంగా మారింది.
తృప్తికి ఈ సినిమా రిజల్ట్ తృప్తినిచ్చిందట. ఎందుకంటే “యానిమల్” తర్వాత ఆమె తన క్రేజ్ ని నిలబెట్టుకొంది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ రావడానికి ఈ సినిమాలోని “తౌబా తౌబా” పాటతో పాటు విక్కి కౌశల్ కారణం. వీటితో పాటు తృప్తి మరో కారణం. సో… ఈ భామకి ఇంకా అవకాశాలు పెరుగుతాయి. అందుకే తృప్తి ఆనందంగా ఉంది.
ప్రస్తుతం హిందీలో ఆమె మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. అవి కూడా పెద్ద బ్యానర్ చిత్రాలే.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More