టాలీవుడ్ లో తారాజువ్వలా దూసుకొచ్చిన శ్రీలీల, తక్కువ టైమ్ లోనే డౌన్ అయింది. ఎంత ఫాస్ట్ గా కెరీర్ ఊపందుకుందో, అంతే వేగంగా డౌన్ ఫాల్ కూడా మొదలైంది.
ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు తగ్గాయి. అయినప్పటికీ చేతిలో పవన్ కల్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్”, రవితేజ కొత్త సినిమా వంటివి ఉన్నాయి. దాంతో శ్రీలీల కాస్త ధైర్యంగానే ఉంది.
మరోవైపు ఆమె కెరీర్ విషయంలో ఇతర భాషలపై దృష్టి పెట్టింది. ఏకంగా బాలీవుడ్ మూవీస్ వైపు శ్రీలీల దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె క్రేజీ ఆఫర్ కొట్టేసిందంటూ కథనాలు వస్తున్నాయి.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన ఇబ్రహీం తాజాగా ఓ సినిమా పూర్తిచేశాడు. ఇప్పుడు తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు.
కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఇబ్రహీం అలీఖాన్ సరసన హీరోయిన్ గా శ్రీలలను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More