దర్శకుడు శంకర్ కు తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆయన మొదటి సినిమా “జెంటిల్ మేన్” తెలుగులో డబ్ సంచలన విజయం సాధించింది. అది మొదలు ఆయన అన్ని సినిమాలు తెలుగులో అనువాదమై హిట్ అయ్యాయి. కానీ తెలుగులో ఎందుకు సినిమాలు చేయలేదు? దీనికి శంకర్ సమాధానమిచ్చాడు.
తను తెలుగులో సినిమా చేయడానికి విశ్వప్రయత్నం చేసిన విషయాన్ని బయటపెట్టాడు. గడిచిన 15 ఏళ్లుగా చిరంజీవితో సినిమా చేయడానికి ప్రయత్నించాడట శంకర్. కానీ కుదరలేదన్నాడు.
ఇక కరోనా టైమ్ లో ప్రభాస్ తో కూడా సినిమా చేయడానికి ప్రయత్నించాడట. ఈ ఇద్దరి మధ్యలో మహేష్ బాబుతో కూడా సినిమా చేయడానికి తెగ ప్రయత్నం చేశాడట. కానీ వివిధ కారణాల వల్ల వీళ్ల ముగ్గురితో సినిమాలు చేయలేకపోయానని, అలా టాలీవుడ్ లో అడుగుపెట్టడానికి తనకు అవకాశం రాలేదని వెల్లడించాడు.
ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో తను టాలీవుడ్ లో అడుగుపెడుతున్నానని తెలిపిన శంకర్… చరణ్ ను డైరక్ట్ చేస్తుంటే, చిరంజీవిని డైరక్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందన్నాడు. తన కెరీర్ లో ‘గేమ్ ఛేంజర్’ను పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంగా చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More