సమంత ఒకప్పుడు ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉండేది. 10 మిలియన్ కి పైగా ట్విట్టర్ లో ఆమెకి ఫాలోవర్స్ ఉన్నారు. అయినా ఆమె ఎందుకనో కొన్నేళ్లుగా ట్విట్టర్ కి దూరమైంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కేవలం ఇన్ స్టాగ్రామ్ కి పరిమితం అయింది.
తాజాగా ట్విట్టర్ లోకి వచ్చింది. పాత పోస్టులను అన్నింటిని తొలగించింది. పూర్తిగా కొత్తగా, సరికొత్తగా మళ్ళీ ట్విట్టర్ హ్యాండిల్ ని వాడుతోంది. ఆమె సహ నిర్మాతగా వ్యహరించిన “శుభం” అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది. అంతా కొత్తవాళ్లు నటించిన ఆ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ఆమె ఇప్పుడు ట్విట్టర్ లో తన హ్యాండిల్ ని యాక్టివేట్ చేసింది.
కేవలం ఈ సినిమా ప్రమోషన్ కోసమే ట్విట్టర్ ని వాడుతోందా లేక మునుపటిలా అన్ని విషయాలపై పోస్ట్ చేస్తుందా అనేది చూడాలి.
ప్రస్తుతం ఆమె దర్శకుడు రాజ్ తో డేటింగ్ లో ఉన్నట్లు టాక్. ఆమె నిర్మించిన “శుభం” దర్శకుడు ప్రవీణ్ కూడా ఒకప్పుడు రాజ్ నిడుమోరు వద్ద సహాయ దర్శకుడిగా చేశారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More