“మత్తు వదలరా 2” సినిమాతో హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు ఎంత క్రేజ్ వచ్చిందో మనం చెప్పలేం కానీ.. అందులో కీలక పాత్ర పోషించిన ఓ అమ్మాయికి మాత్రం భయంకరమైన పాపులారిటీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే జస్ట్ 48 గంటల్లో ఆమె వైరల్ అయింది.
“మత్తు వదలరా 2″లో ఆమె పాత్ర పేరు రియా. రియా ఎవరని అజయ్ అడిగితే దామినీ డాటర్ అని కమెడియన్ సత్య చెబుతాడు.. ఆ సీన్ తో రియా పేరు పాపులర్ అయింది. ఆ పాత్ర పోషించిన అమ్మాయిని వెదికే పనిలో సోషల్ మీడియాలో పడింది. అలా రియా పాత్ర పోషించిన ఇషా యాదవ్ ఓవర్ నైట్ లో పాపులర్ అయింది.
ఇనస్టాగ్రామ్ లో ఈమె చాలా పాపులర్. ఈమె చేసే రీల్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ఈ టాలెంట్ చూసే దర్శకుడు రితేష్ రానా, ఇషాకు అవకాశం ఇచ్చాడు. సినిమా రిలీజైనప్పుడు ఇషాకు పెద్దగా పేరు రాలేదు కానీ, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
అలా టాలీవుడ్ లో పాపులర్ అయింది ఈ బ్యూటీ. “మత్తు వదలరా 2” ఇచ్చిన క్రేజ్ తో ఆమె మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలనుకుంటోంది.
టాలీవుడ్ వరకు ఆమె ఇషా యాదవ్ అని కాకుండా రియా అని పేరు మార్చుకుంటే బెటరేమో.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More