ప్రభాస్ ని, పాయల్ కి లింక్ కలిపారట. అతన్ని ఆమె పెళ్లి చేసుకోనుంది అని కూడా వార్తలు అల్లేశారట. స్వయంగా పాయల్ రాజ్ పుత్ నోటి నుంచి వచ్చిన మాటలివి. తనకు ప్రభాస్ కు కొంతమంది పెళ్లి చేశారని అంటోంది పాయల్. అయితే అది నిజంగా కాదు, గాసిప్స్ రూపంలో.
కొన్ని నెలల కిందట ప్రభాస్-పాయల్ కు పెళ్లి అంటూ పుకార్లు వచ్చాయంట. ఆ రూమర్స్ చదివి తను చాలా నవ్వుకున్నానని చెప్పుకొచ్చింది పాయల్. అదే టైమ్ లో ఆ పుకార్లు నిజమైతే బాగుండేదనే ఆలోచన కూడా వచ్చినట్టు వెల్లడించింది.
తన కెరీర్ లో బాగా నవ్వుకున్న పుకారు ఏంటనే ప్రశ్నకు సమాధానంగా ఇలా “ప్రభాస్ తో పెళ్లి” టాపిక్ ను తెరపైకి తీసుకొచ్చింది.
అయితే పాయల్ చెబుతున్నంతగా ప్రభాస్ తో ఆమెకు పెళ్లి అంటూ పుకార్లు రాలేదు. మరి ఈ ఊహాగానాల్ని తనకుతానుగా పుట్టించుకుందా లేక నిజంగానే ఎక్కడైనా చదివిందా అనేది ఆమెకే తెలియాలి. లేక తనపై అటెన్షన్ పడడం కోసం ప్రభాస్ పేరుని వాడుకుంటోందా?
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More