పవన్ కల్యాణ్ గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడినా అవి సెన్సేషన్ అవుతాయి. తాజాగా నాని, పవన్ కల్యాణ్ పై స్పందించాడు. ఒకప్పుడు పవన్ పై తన అభిప్రాయాన్ని, తాజాగా అతడిపై తన ఒపీనియన్ ను బయటపెట్టాడు.
“ఆయన సినిమాల్లో ఉన్నంతవరకు ఓ మిస్టిక్ పర్సనాలిటీ. సినిమాలు చేస్తున్నారు, పవర్ స్టార్, హీరో అనే ఫీలింగ్. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనిషి పర్సనల్ గా తెలిశాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. గ్రేట్ వ్యక్తి.”. ఇలా పవన్ పై తన అభిప్రాయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాడు నాని.
రానా కొత్తగా స్టార్ట్ చేసిన చిట్ ఛాట్ షోకు హాజరయ్యాడు నాని. అతడితో పాటు తేజ సజ్జా, ప్రియాంక మోహన్ కూడా వచ్చారు. వీళ్లంతా కలిసి పిచ్చాపాటీ మాట్లాడుకున్న టైమ్ లో ‘ఓజీ’ సినిమా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు నాని.
ప్రస్తుతం ఈ హీరో ‘హిట్-3’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ అనే సినిమా కూడా సెట్స్ పై ఉంది. వీటిలో ముందుగా ‘హిట్-3’ థియేటర్లలోకి వస్తుంది.
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More