ఇప్పుడు కాదు, చాన్నాళ్లుగా నాని పెంచుకుంటూ పోతున్నాడు. తన సినిమాల బడ్జెట్స్ పెంచుతున్నాడు, పనిలోపనిగా తన రెమ్యూనరేషన్ కూడా పెంచుతున్నాడు. అతడి సినిమాల రిలీజ్ స్పాన్ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అది కాదు.
సినిమా-సినిమాకు రిలీజ్ చేసే లాంగ్వేజెస్ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు నాని. ఒకప్పుడు తెలుగులో మాత్రమే నాని సినిమాలు రిలీజయ్యేవి. ఆ తర్వాత తమిళ్-మలయాళంలో రిలీజ్ పెట్టాడు. రీసెంట్ గా హిందీ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నాడు.
ఇలా తన ప్రతి సినిమాకు భాషల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న నాని, ఈ క్రమంలో ‘పారడైజ్’ సినిమాను ఏకంగా 8 భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, బెంగాలీ, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా వచ్చేసింది.
పాన్ ఇండియా సక్సెస్ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు నాని. ‘దసరా’ సినిమా తన కోరిక తీరుస్తుందని భావించాడు కానీ వర్కవుట్ కాలేదు. ‘సరిపోదా శనివారం’ హిందీ వెర్షన్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఆఖరి నిమిషంలో మినిమం రిలీజ్ తో సరిపెట్టాడు.
ఇన్నాళ్లకు ‘ప్యారడైజ్’ సినిమా తన కలను నెరవేరుస్తుందని భావిస్తున్నాడు నాని. ఈసారి పాన్ ఇండియా కాకుండా, ఒకేసారి పాన్ ఇంటర్నేషనల్ కు వెళ్లాలని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే
హిందీ, బెంగాలీ భాషలతో పాటు ఏకంగా ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More