“కుబేర” సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఐతే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఆయన అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ నటుడు చెయ్యాల్సిన పాత్రనే నాగార్జున పోషించాడు తప్ప అంతకుమించి ప్రత్యేకత లేదు అని వారు అంటున్నారు.
కానీ నాగార్జున అభిప్రాయం వేరు. “ఈ సినిమా మొత్తం దీపక్ (నాగార్జున పోషించిన పాత్ర) చుట్టే తిరుగుతుంది. అంటే నా పాత్ర నిడివి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కాదు నా పాత్రే సినిమాలో ప్రధానం,” అని నాగార్జున ఈ రోజు విలేకర్లతో ముచ్చటిస్తూ చెప్పారు. ఇలాంటి రోల్స్ చేసేందుకు వెనుకాడను అని చెప్పారు.
ఈ సినిమాలో ధనుష్ హీరో. కానీ నాగార్జున పాత్ర కూడా కీలకమే. ఐతే, అలా అని ఈ పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అంతగా లేదనే చెప్పాలి. కానీ నాగార్జున కూడా తన వయసు, తనకు ఇప్పుడు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పాత్రలే చెయ్యాలి అనుకుంటున్నారు.
త్వరలో విడుదల కాబోయే “కూలి”లో ఏకంగా విలన్ తరహా పాత్రలో కనిపిస్తారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More