మీనాక్షి చౌదరి… కెరీర్ ప్రారంభించిన అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ లో దూసుకుపోతోంది. శ్రీలీల, పూజా హెగ్డే క్రేజ్ తగ్గడం ఈమెకు బ్రహ్మాండంగా కలిసొచ్చింది. అలా వరుసగా అవకాశాలు అందుకుంటూ, గ్లామర్ బ్యూటీ అనిపించుకుంది.
ఇప్పుడీ హీరోయిన్ తనలోని నటిని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. దీనికి ‘లక్కీ భాస్కర్’ సినిమాను ఎగ్జాంపుల్ గా చెబుతోంది.
“లక్కీ భాస్కర్ లో నా పాత్రపై చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాను. ఎందుకంటే, నా పాత్రతో ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ దక్కుతుంది. సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. రొమాన్స్, ఫన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే బెస్ట్. ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. నాలో నటిని చూస్తారు.”
ఇలా ‘లక్కీ భాస్కర్’తో పూర్తిస్థాయిలో తనలోని నటిని చూస్తారని నమ్మకంగా చెబుతోంది మీనాక్షి.
ALSO READ: The busiest actresses in Tollywood (2024)
ఈ సినిమాతో పాటు ఆమె వెంకటేశ్ సరసన ఓ మూవీ చేస్తోంది. అందులో పోలీసాఫీసర్ రోల్ చేస్తోంది. ‘లక్కీ భాస్కర్’లో తన పాత్రను చూసిన తర్వాత వెంకటేశ్ సినిమాలో తన పాత్రను మరింతగా ఆదరిస్తారని చెబుతోంది. దీపావళి కానుకగా ఈనెల 31న థియేటర్లలోకి వస్తోంది ‘లక్కీ భాస్కర్.’
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More