కొన్ని విషయాల్లో హీరోయిన్లు యమ స్ట్రిక్ట్ గా ఉంటారు. కొంతమంది హీరోయిన్లు లిప్ కిస్సులకు దూరం. మరికొంతమంది హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ కు దూరం. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కు కూడా ఇలాంటి ఓ రూల్ ఉంది. ఆమె బికినీకి దూరం.
తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది ఐశ్వర్య మీనన్. అందులో భాగంగా బికినీలో చూడాలని ఉందంటూ ఓ అభిమాని పోస్టు పెట్టాడు. దీనికి సంబంధించిన మీనన్.. తను జీవితంలో బికినీ ధరించనని, తనను బికినీలో చూడాలని ఎవరైనా ఆశపడితే అది నెరవేరదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. చీరలో తను చాలా అందంగా కనిపిస్తానని, చీరకట్టు తనకు అత్యంత సహజసిద్ధంగా సెట్ అవుతుందని చెప్పుకొచ్చిన ఐశ్వర్య.. అదే టైమ్ లో గ్లామర్ గా కూడా కనిపించడం తనకు ఇష్టమని తెలిపింది. అయితే గ్లామర్ ముసుగులో బికినీ మాత్రం వేసుకోనని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా పెళ్లిపై కూడా స్పందించింది. ప్రస్తుతం కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్నానని, మరికొన్నేళ్ల పాటు పెళ్లి చేసుకోనని ఆమె ప్రకటించింది.
నిఖిల్ హీరోగా నటించిన “స్పై” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఐశ్వర్య మీనన్. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత “భజే వాయువేగం” అనే సినిమా చేసింది. అది కూడా ఫ్లాప్ అయింది. త్వరలోనే కొత్త సినిమాలు ప్రకటిస్తానంటోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More