మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది “మనమే” సినిమా. ప్రతి శుక్రవారం సినిమాలు వస్తుంటాయి. ఇందులో కొత్తేం లేదు. కానీ మనమే మాత్రం చాలామందికి చాలా కీలకం. ఈ సినిమా హిట్ కొంతమందికి చాలా అవసరం.
కృతిశెట్టి.. ఉప్పెనలా ఎగసిపడిన ఈ అందం, కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లకే డౌన్ అయింది. వరుస ఫ్లాపులు ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో పరభాషా సినిమాల వైపు ఆమె వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి టైమ్ లో మనమే సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అందరికంటే కృతికే బాగా అవసరం.
ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు కూడా ఈ సినిమా సక్సెస్ అవసరం. ‘ఫ్యాక్టరీ’ పెట్టి వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు కానీ సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే “ధమాకా” తర్వాత మరో హిట్ లేదు. ఈగల్ అయితే భారీ డిజాస్టర్. దీంతో ‘మనమే’పైనే ఆశలు పెట్టుకున్నాడు.
వీళ్లకు ఈ సినిమా సక్సెస్ ఎంత అవసరమో, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు అంతకంటే ఎక్కువ అవసరం. ఈ డైరక్టర్ ను జనం దాదాపు మరిచిపోయారు. మళ్లీ లైమ్ లైట్లోకి రావాలంటే ఈ సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More