హీరోయిన్ల మధ్య కెరీర్ పరంగా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఒక హీరోయిన్ ఛాన్స్ ను మరో హీరోయిన్ ఎగరేసుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ల మధ్య ఫ్రెండ్ షిప్ సాధ్యమా?
అవును….కచ్చితంగా కుదురుతుందని చెబుతోంది కాజల్.
ఇండస్ట్రీలో తనకు సమంత, తమన్న బెస్ట్ ఫ్రెండ్స్ అంటోంది కాజల్. సమంతతో కలిసి “బృందావనం” సినిమా చేసింది కాజల్. అప్పట్నుంచి వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక తమన్న, కాజల్ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. పైగా ఇద్దరీ ముంబయి. అలా ఈ ఇద్దరు కలిశారు.
కొన్నేళ్లుగా తాము ముగ్గురం మంచి స్నేహితులమని చెబుతోంది కాజల్. తమ బిజీ షెడ్యూల్స్ వద్ద పెద్దగా కలుసుకోవడం కుదరదని, ఒకవేళ ముగ్గురం కలిస్తే మాత్రం మామూలుగా ఉండదని చెబుతోంది. ఎన్నో కబుర్లు చెప్పుకుంటామని, జ్ఞాపకాలు నెమరువేసుకుంటామని అంటోంది.
అయితే తమ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చలు మాత్రం రావని అంటోంది. సినిమాలు తప్ప అన్నింటి గురించి వీళ్లు మాట్లాడుకుంటారంట.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More