నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న “కల్కి 2898 AD” నుంచి అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన వీడియో విడుదలైంది. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా నటిస్తున్నారు. ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థాముడు. కల్కి అవతారం కోసం అశ్వత్థాముడు నిరీక్షిస్తున్నట్లు ఈ సినిమాలో చూపించారు. వేల సంవత్సరాలుగా ఆయన నిరీక్షిస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది.
ఇందులో యంగ్ అమితాబ్ లుక్ కూడా ఉంది. అమితాబ్ బచ్చన్ పాతికేళ్ల వయసులో ఉన్నప్పటిలా చూపించారు. ఇదెలా సాధ్యం? బహుశా అభిషేక్ బచ్చన్ ఆ సీన్ లో నటించారా? లేక అమితాబ్ లాంటి పోలికలున్న వ్యక్తికి అలాంటి గెటప్ వేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం… టెక్నాలజీ అని చెప్పాలి.
“డీ ఏజ్” అనే సాంకేతికతతో నటుల వయసు తగ్గించే టెక్నాలజీని ఇటీవల హాలీవుడ్ లో విరివిగా వాడుతున్నారు. బాలీవుడ్ లో షారుక్, అమీర్ ఖాన్ సినిమాలల్లో వాడారు. ఇప్పుడు అమితాబ్ కోసం తెలుగులో ఈ సినిమాతో ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
ఈ మధ్య విడుదలైన నాగార్జున మూవీ “నా సామి రంగ”లో కూడా ఈ టెక్నాలజీని కొంత ఉపయోగించారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ది చాలా కీలక పాత్ర. ఇక కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లు. ఐతే, “కల్కి 2898 AD”కి సంబంధించిన కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More