ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విడాకుల కేసులు ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్… ఇలా అన్ని చోట్లా విడాకుల గురించి వింటూనే ఉన్నాం. తాజాగా హీరోయిన్ భావన గురించి కూడా కేరళలో అలాంటి పుకార్లు వినిపించాయట.
దాంతో, వాటికి ఆమె ఫుల్ స్టాప్ పడేలా వివరణ ఇచ్చింది. తన భర్త నుంచి విడిపోలేదు అని క్లారిటీ ఇచ్చింది. తాము అన్యోన్యంగానే ఉన్నామని తెలిపింది.
భావన నిర్మాత నవీన్ ని పెళ్లాడింది. కాకపోతే, ఆమె తన భర్తకు సంబంధించిన ఫోటోలను పెద్దగా పోస్ట్ చెయ్యదు. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా ప్రతిరోజు తన ఫోటోలను పెడుతుంది. చాలా యాక్టివ్ గా ఉంటుంది సోషల్ మీడియాలో. కానీ తన పర్సనల్ లైఫ్… ముఖ్యంగా భర్త గురించి ఏమి రాయడం లేదట. దాంతో విడిపోయినట్లు వార్తలు మొదలయ్యాయి. దాదాపు 9 నెలల క్రితం ఆమె తన భర్త నవీన్ ఫోటోని షేర్ చేసింది. ఆ తర్వాత ఏమి అప్డేట్ లేదు.
తెలుగులో “ఒంటరి”, “మహాత్మా” వంటి సినిమాల్లో నటించిన భావన మీనన్ ని మలయాళ హీరో దిలీప్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో దిలీప్ జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. ఆ కిడ్నాప్ కేసులో భావనకి అండగా నిలిచారు నవీన్. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More