దక్షిణాది హీరోల్లో అజిత్ కుమార్ పద్దతి, శైలి ప్రత్యేకం. వివాదాలకు దూరంగా ఉంటాడు. సింపుల్ గా బతుకుతాడు. సినిమాల కన్నా కార్ రేసింగ్ లు, బైక్ రేసింగ్ లు అతనికి చాలా ఇష్టం. వాటి మీదే ప్రాణం పెడుతాడు. తన సినిమాలకు సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించడు. ప్రమోషన్ లకు పూర్తిగా దూరం. అయినా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అదీ స్టార్డం.
అజిత్ కి ఇటీవల పద్మభూషణ్ తో ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు తీసుకున్న తర్వాత అజిత్ ఇండియాటుడే ఛానెల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన భార్య షాలినిని పొగిడాడు.
“షాలిని పెద్ద హీరోయిన్. ఆమెకి చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ నా కోసం తన, మా కుటుంబం కోసం కెరీర్ ని పక్కన పెట్టింది. ఎన్నో త్యాగాలు చేసింది. కష్టాల్లో అండగా ఉంది. జీవితాన్ని మా కుటుంబానికి అంకితం చేసింది. నేను సరైన నిర్ణయాలు తీసుకోనప్పుడూ, నేను తప్పులు చేసినప్పుడూ అండగా నిలిచింది. సో నా విజయం మొత్తం ఆమెకే చెందుతుంది,” అని పొగిడాడు అజిత్.
షాలిని “సఖి” సహా అనేక హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అజిత్ తో కూడా నటించింది. ఐతే, వీరు ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రేమలో పడి, ఆ వెంటనే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More